Shuru
Apke Nagar Ki App…
Anantapur railway
HC
Hmc Company
Anantapur railway
More news from Spsr Nellore and nearby areas
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- జై హొ సనాతన ధర్మం3
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.1