ఎస్సీ ఎస్టీలకు పక్కా స్మశానాలు ఏర్పాటు చేయాలి. పలమనేరు ఆగస్టు 8( ప్రజా ప్రతిభ) ఎస్సీ ఎస్టీలకు పక్కా స్మశానాలను ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ పలమనేర్ డివిజన్ కార్యదర్శి టి .మణి డిమాండ్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం పలమనేర్ పట్టణంలోని మానవ హక్కుల కార్యాలయం నందు రమణారెడ్డి అధ్యక్షతన స్మశానాలు విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి, సరస్వతి, గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు టి. మునిరత్నం మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు మేరకు ఎస్సీ ఎస్టీ కులాలకు జీవో నెంబర్ 12:35 ప్రకారం రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పోరాటాలు ద్వారా సాధించుకున్న హక్కులను అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో నూటికి 85% పక్కా స్మశానాలు లేక కుంటల్లో చెరువుల్లో చనిపోయిన వారిని పూడ్చుకుంటున్నారని తెలిపారు. గతంలో ఈ జీవో పూర్తిస్థాయిలో అమలు చేయాలని అనేకమైన పోరాటాలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చినా చీమకుట్టినంత చలనం పాలకులకు గానీ, అధికారులకు గానీ లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎస్సీ ఎస్టీ హక్కులు హరించడం వల్లే వారిపై అగ్రకుల పెత్తందారులు విపరీతమైన దాడులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని వీటన్నిటికీ కారణం ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులేనని ఆరోపించారు. గతంలో స్మశానాలు ఏర్పాటు చేయాలని అధికారులను అడిగినప్పుడు భూములే లేవని నమ్మ పలికి ఆఖరుకు ప్రభుత్వ భూములను అప్పనముగా అగ్రకుల పెత్తందారులకు అవినీతికి పాల్పడి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఉన్న స్మశానాలకు జీవో నెంబర్ 12:35 ప్రకారం మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి, సూర శ్రీనివాసులు ,శివన్న, వాణి, సుమతి, దాము, వెంకటేష్, మునెప్ప పాల్గొన్నారు