తిరుపతిలో కొత్త సంచలనంగా టాటా హిటచి షిన్‌రాయి సిఈవి5 లాంచ్. నగరంలోని ఎంజీ బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టాటా హిటచి షిన్‌రాయి సిఈవి5 నూతన మోడల్‌ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, ఇంధన పొదుపు లక్షణాలతో ఈ మోడల్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈ లాంచింగ్ కార్యక్రమానికి టాటా హిటచి నేషనల్ హెడ్ శ్రీనివాస్, సర్వీస్ హెడ్ కన్నన్, జెడ్ బిఏం మహబూబ్ ఖాన్, ఏరియా మేనేజర్ మనోజ్, ఎంజీ బ్రదర్స్ ఎండీ రాఘవేంద్ర, ఏజీఎం సతీష్, ఎంజి బ్రదర్స్ చిత్తూరు మేనేజర్ రమేష్, మరియు పలువురు లోకల్ కస్టమర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టాటా హిటచి నేషనల్ హెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కస్టమర్ యొక్క అత్యంత నమ్మకమైన భాగస్వామి” అనే కాన్సెప్ట్‌తో ఈ కొత్త షిన్‌రాయి సిఈవి5 మోడల్‌ను రూపొందించాం, ఇది కఠినమైన పనులకు తగిన శక్తి, అధిక సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో కస్టమర్లకు మించిన విలువను అందిస్తుంది” అని తెలిపారు.ఎంజి బ్రదర్స్ ఎండి మాట్లాడుతూ కస్టమర్స్ సర్వీస్ కోసం ఈరోజే మంగళవారం తిరుపతి ఆటోనగర్ లో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని తెలిపారు.కార్యక్రమం అనంతరం కొత్త మోడల్‌కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లు, సర్వీస్ సదుపాయాలు, ప్రారంభ ఆఫర్ల వివరాలు కస్టమర్లకు పరిచయం చేశారు.ఎంజి బ్రదర్స్ ఏజీఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కస్టమర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Post by Omnamashivaya S1
- *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.1
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.1
- పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయండి1
- ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నా. : కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం.. : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు1